గురువారం ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు డీలిమిటేషన్‌పై ప్రభుత్వ తీర్మానంను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ తీర్మానం అనంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లు, అవయవ దానం బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 12వ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలతో సభ జోరుగా సాగింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వం దృష్టి అభివృద్ధి, సంక్షేమం పైనేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డం పడుతోందని, పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిన్న హోం, అడ్మినిస్ట్రేషన్ పద్దుపై చర్చ జరిగింది.