CM Revanth Reddy : వాళ్లకి జైల్లో డబుల్‌రూం కట్టిస్తానని హామీ ఇచ్చా.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చేలేదు
- తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- రుణమాఫీ, రైతు సంక్షేమంపై సీఎం కీలక ప్రకటనలు
- తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విచక్షణాధికారులు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా అని ఎన్నికల హమీ ఇచ్చానన్నారు.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారని, ఎన్నిలయ్యాక రుణమాఫీకి ఐదేళ్ల సమయం పట్టిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్లు చేయలేదన్నారు. పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు 16,908 కోట్లు రుణమాఫీ చేశారు. మేం 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. రైతుబంధు ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకొని వారు పారిపోయారని, వారు ఎగ్గొట్టిన డబ్బును నేను సీఎం అయ్యాక చెల్లించాను అని ఆయన పేర్కొన్నారు. మొదటి విడత రూ.7625 కోట్లు నేను చెల్లించా అని సీఎం రేవంత్ తెలిపారు.
MP Avinash Reddy: ఇంత తక్కువ టైంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది!
Also Read
మేం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకం కింద రూ.12 వేల కోట్లు చెల్లించామన్నారు. వాళ్లు వరి పండించి రూ.4500కు అమ్మకున్నారని, పేద రైతులకు మాత్రం వరేస్తే ఉరే అని ప్రచారం చేశారన్నారు. మేం వరి వేయమని చెప్పి, బోనస్ కూడా ఇచ్చామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ కనిపెట్టిందే కాంగ్రెస్ అని, మీరు పదేళ్లు చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపామని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వారి హయాంలో అకాల వర్షాలకు ఏనాడు నష్టపరిహారం ఇవ్వలేదని, మేం నష్టపరిహారం చెల్లించామన్నారు. కష్టపడి పనిచేస్తున్నానని ప్రతిపక్ష నాయకుడు చెప్పొచ్చు కదా అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నాలుగు రకాలుగా అప్పు చేసుకునే అవకాశం ఉంటుందని, మూడు రకాల అప్పులు కలిపి తెలంగాణ ఏర్పడే నాటికి 90 వేల 160 కోట్ల అప్పు ఉండేదన్నారు. 1 డిసెంబర్ 2023 నాటి అప్పు రూ. 6,69,257 కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
Ambati Rayudu: ఐపీఎల్లో అతనే నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!