CM Revanth Reddy : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై ఎవరి వద్ద అయినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు, కేసీఆర్ నువ్వే రా అంటూ కౌంటర్ ఇచ్చారు. 2023లో ప్రజలు కాంగ్రెస్…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రాంతం గొప్ప చైతన్యంతో కూడినదని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లావాసులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వరంగల్ అభివృద్ధికి రూ. 6,500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మొత్తం రూ. 630.27 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టినవి. ముఖ్య అభివృద్ధి పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: విద్యా రంగ అభివృద్ధి రూ. 200 కోట్లు: జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రూ. 5.5 కోట్లు: ఘన్పూర్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు.
Konda Surekha : తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ భయపడుతోందని, ప్రజల ముందు తాము చేసిన తప్పులు బయటపడుతాయనే భయంతోనే అసలు విషయాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు అనవసరంగా అర్ధాంతరంగా వ్యవహరించడం సబబు కాదని, ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని అన్నారు. “బీఆర్ఎస్ సభ్యులు…
తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చావును కోరుకోవడం ఎంత దారుణమో బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన హరీష్ రావు, కృష్ణా…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అని.. గాంధీ భవన్ లో మాట్లాడినట్టు ఉంది అని బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో అన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారా.. అజ్ఞానమే.. తన విజ్ఞానం అనుకుంటున్నారు అని…
KTR : బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) తన పార్టీ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రహస్య సమావేశం నిర్వహించారని గతంలో మండిపడ్డ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై అధికారికంగా సమీక్షలు నిర్వహించాలి కానీ, రహస్యంగా బీజేపీ నేతలతో…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తూ, అక్కడి నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మొత్తం 39 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ తీరు “గల్లీలో హోదా మరిచి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు” అన్నట్లు ఉందని, తన కార్యాలయం దాటి బయటకి…
Raghunandan Rao : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతించకపోతే, రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు కలిసి తిరుమలలో టీటీడీ అధికారులతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు,…