తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. ఫస్ట్ రోజే ఆయన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.. గాంధీ భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతోన్న సమయంలో.. సీఎం రేవంత్ అని నినాదాలు చేశారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు.. ఆ నినాదాలపై సీరియస్ అయ్యారు రేవంత్.. ఎవరైనా ఇప్పటి నుండి సీఎం అంటే పార్టీలో ఉండరు.. పార్టీ నుండి బయటకు పంపుతాం.. వ్యక్తిగత నినాదాలు పార్టీకి నష్టం అని స్పష్టం చేశారు.. నన్ను అభిమానించే…
రేపు టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధత్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే… గాంధీ భవన్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రేపు పదవీ బాధత్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా నాంపల్లి దర్గాకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు రేవంత్. read also : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్ల…
కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. ఆ దీక్షకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తెలంగాణ కోసం ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్న ఆయన.. దీక్షలు చేయాలని మాకు చెప్పడం కాదు.. ముందు కాంగ్రెస్ పార్టీ…
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.. రాళ్లతో కొట్టడం, ఉరికించి కొట్టడం, చెప్పుల దండలు.. ఇలా ఇప్పుడు లోపల(జైలు)కి పోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వచ్చింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టి.పీసీసీ చీఫ్ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందన్న…
కామారెడ్డి : రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పాదయాత్ర పై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్.. ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావని.. రెండు వేల పెన్షన్ ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా ? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. రైతు బంధు, ఉచిత విద్యుత్, కెసిఆర్ కిట్ లు ఇస్తున్నారని పాదయాత్ర చేస్తావా…? అని నిలదీశారు. read also : కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ..…
తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా…
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కొత్త పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం.. దానికి కౌంటర్‌గా ఆ ఎమ్మెల్యేలు ఎదురు దాడిగి దిగడం జరిగిపోయాయి.. మీరు రాళ్లు విసిరితే.. మేం చెప్పులతో కొడతామంటూ హాట్ కామెంట్లు చేశారు పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. అయితే, ఆ వ్యాఖ్యలపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక్కడు కూడా మంత్రి వర్గంలో లేరన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.. ఎర్రబెల్లి,…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ ఫైర్ అయ్యారు. వివాదాల మధ్య రేవంత్.. పిసిసి అధ్యక్షుడయ్యాడని…రేవంత్ రాజకీయ ఎదుగుదల వివాదాస్పదమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం లో రాళ్లతో కొట్టాలని ఉందా.. అలా మాట్లాడితే చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిషేధించిన మావోయిస్టు పార్టీలో ఉండే వాళ్ళలా రేవంత్ మాట్లాడుతున్నారని.. రాజస్థాన్ లో ఆరుగురు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని చురకలు అంటించారు. read also : తెలంగాణలో…