వైఎస్ విజయమ్మ నేతృత్వంలో నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంస్మరణ సభకు తెలంగాణ మరియు ఏపీ నుంచి కీలక రాజకీయ నేతలు వచ్చారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినేట్ లో పనిచేసిన మంత్రులు ఈ సభకు హజరయ్యారు. ఇందులో భాగంగానే… కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్మరణ సభ జరిగే రెండు గంటల ముందే.. ఆ సభకు హజరు కావద్దని కాంగ్రెస్ ఆర్డర్స్ జారీ చేసిందని మండిపడ్డారు.
తనకు మూడు రోజుల కిందే… ఈ సభకు హజరుకావాలని ఆహ్వనం వచ్చిందని…కానీ ఇంత సభ జరిగే ముందు హజరుకావద్దని చెప్పడం దారుణమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అని.. ఆయన భార్య తనకు వదిన లాంటిది… అలాంటి సమయంలో ఆమె పిలుస్తే… కచ్చితంగా వెళతానని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి… అందుకే ఈ సభకు వెళుతున్నాని చెప్పారు. తనను వెళ్లొద్దనటానికి ఇదేమైనా తాలిబన్ల రాజ్యామా ? అని తెలంగాణ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. తమ కాంగ్రెస్ ఎమ్మెల్యే…. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు కాళ్లు మొక్కిందని… సీతక్కపై పరోక్షంగా మండిపడ్డారు. ఆమె చంద్రబాబు కాళ్లపై పడితే.. తప్పులేదు.. కానీ.. సంస్మరణ సభ వెళితే… తప్పేంటని ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని…తన ప్రాణం పోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. తనకు అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని… అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయనన్నారు. తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు.