అయ్యో రేవంత్.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపం తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్లు ఒకటి తలిస్తే.. అధిష్టానం ఇంకోటి తలిచినట్టుంది. ఈ గ్రూపుల కొట్లాటలో.. తలదూర్చడం ఎందుకనుకున్నారో ఏమో కానీ.. ఇప్పట్లో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ నెల 8నే గజ్వేల్ లేదా.. నర్సాపూర్ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది.
ఆ తర్వాత 17న తెలంగాణ ఉద్యమ కేంద్రం వరంగల్ లో ముగింపు సభను ధూంధాం గా నిర్వహించి సత్తా చాటాలని.. రాహుల్ గాంధీని పిలిపించి రచ్చ చేయాలని భావించింది. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. రాహుల్ రావడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
కాకుంటే.. వారు చెబుతున్న కారణం మాత్రం మరోలా ఉంది లెండి. దేశ రాజకీయాల దృష్ట్యా రాహుల్ గాంధీ చాలా బిజీగా ఉన్నారని.. ఇప్పట్లో ఆయన వరంగల్ కు వచ్చే అవకాశాలు లేవని.. కాబట్టి 17న అక్కడ దళిత గిరిజన దండోరా ముగింపు సభ పెట్టినా.. రాహుల్ లేకుండానే నిర్వహించుకోవాలని.. రేవంత్ అండ్ బ్యాచ్ కు సంకేతాలు అందాయట. ఇది.. పార్టీ శ్రేణుల్లో కాస్త అసంతృప్తిని కలిగించిందన్నది వాస్తవం.
ఇది తెలుసుకున్న రేవంత్ టీమ్.. ప్లాన్ చేసింది. రూట్ మార్చింది. 8న గజ్వేల్ లో సభ నిర్వహించాలంటే సమయం సరిపోదు కాబట్టి.. ఆ నిర్ణయాన్ని మార్చి.. నేరుగా 17నే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోనే సభ నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చారట. ఈ సభకు సమయం కూడా సరిపోతుందని భావిస్తున్నారట. రాహుల్ రావడం లేదు కాబట్టి.. మరో ముఖ్యనేతను ఆహ్వానించాలని నిర్ణయించారట.
లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బలమైన గళం వినిపిస్తున్న మల్లికార్జున ఖర్గేను.. రాహుల్ బదులుగా ఈ సభకు ఆహ్వానించి.. తమ పోరాటాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని రేవంత్ టీమ్ కసరత్తు చేస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఖర్గే అయినా వస్తారా.. దేశ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను సాకుగా చూపి.. ఆయన కూడా రాకుండా ఉంటారా.. అన్న ప్రశ్న.. కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!