స్వయంగా నాకు నేనుగా వెళ్లను.. వాళ్లే వెళ్లగొట్టేలా చేస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటె రెడ్డి కలకలం తీవ్రమవుతోంది. పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం.. ఆ తర్వాత పీసీసీపైనే.. నిద్రపోతోందా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే.. ఆయన తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. కాకుంటే.. తనకు తానుగా కాకుండా.. పార్టీనే స్వయంగా వెళ్లగొట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇందుకు తగ్గట్టుగానే.. కోమటిరెడ్డి మొదటి నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు.. ఆ పోస్టు అమ్ముడుపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత.. వీలు కుదిరినప్పుడల్లా రేవంత్ పై నర్మగర్భ వ్యాఖ్యలు కొనసాగిస్తూ వచ్చారు. మరోవైపు.. రేవంత్ మాత్రం గతంతో పోలిస్తే కాస్త భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తన నోటికి పని చెప్పకుండా.. చేతలతోనే ముందుకు వెళ్తున్నారు.
Also Read
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
ఇది.. కోమటిరెడ్డికి మరింత ఆగ్రహాన్ని తెప్పించినట్టుంది. అందుకే.. అందివచ్చిన అవకాశంగా వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళన సభను తీసుకున్న ఆయన.. మరోసారి నోటికి పని చెప్పారు. తోటి నేతలకు భిన్నంగా నడుచుకుంటూ విజయమ్మ సభకు హాజరయ్యారు. వైఎస్ ను కీర్తిస్తూ.. రేవంత్ అండ్ టీమ్ ను మరింత ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నించారు. చూస్తుంటే.. ఆయన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది.
పీసీసీ ప్రచార కమిటీ బాధ్యుడు మధు యాష్కీ.. ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. కావాలనుకుంటే కోమటిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. అంతే కానీ.. ఇలా పీసీసీ పరువు తీసేలా వ్యవహరించవద్దని కాస్త గట్టిగానే కామెంట్లు వదిలారు. ఈ సమయంలో కూడా.. కోమటిరెడ్డి గురించి రేవంత్ నోరు మెదిపింది లేదు. ఏది జరిగితే అది.. అన్నట్టుగానే ఆయన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదే అవకాశంగా మలుచుకుంటున్న కోమటిరెడ్డి.. తనకు తానుగా పార్టీ వీడేది లేదని.. పంపిస్తే వెళ్లిపోయేందుకు సిద్ధమే అని అన్నట్టుగా విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన దూకుడు ఎక్కడివరకూ వెళ్తుంది.. నిజంగానే పీసీసీ కాస్త తీవ్రంగా స్పందించి.. హై కమాండ్ కు ఫిర్యాదు చేసి.. కోమటిరెడ్డిని వదిలించుకుంటుందా.. అన్నది పార్టీ వర్గాలకు మింగుడుపడకుండా ఉంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!