ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు… ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది… రేవంత్‌రెడ్డితో పాటు.. అప్పటి టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సమన్లు జారీ అయ్యాయి.. ఈడీ కేసులను విచారించే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు నుంచి ఈ సమన్లు జారీ అయ్యాయి… అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ…
దీక్షకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు… రేపు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షకు దిగనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటన ప్రకారం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై నిరసన తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రకటనలో పేర్కొన్న మోత్కుపల్లి… దళిత సాధికారితకోసం సభలు, సమావేశాలు నిర్వహించి దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం,…
మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్…
ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.. తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… దమ్ముంటే రేవంత్‌రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికలకు వెళ్దామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మంత్రి మల్లారెడ్డి సవాల్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై…
తెలంగాణలో మరోసారి సవాల్ పర్వం తెరపైకి వచ్చింది… మంత్రి మల్లారెడ్డి అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీ స్థలం సైతం కబ్జా చేసిందేనంటూ.. తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొందారంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఇక, దీనిపై మంత్రి మల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.. ఆ వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి.. రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి మల్లాడిరెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఏకవచన వ్యాఖ్యలతో విరిచుకుపడ్డ మల్లారెడ్డి.. రాజీనామా చేద్దాం..…
మూడుచింతల వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన రేవంత్… గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి భూములు కబ్జా చేసినట్టు విమర్శించారు.. మల్లారెడ్డి సగం జోకర్, సడం బ్రోకర్ అని వ్యాఖ్యానించిన రేవంత్.. భూములు అమ్మినా..? కొన్నా..? మల్లారెడ్డికి మాములు ఇవ్వాలంట అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, జవహర్ నగర్లో తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి…
మూడు చింతల పల్లిలో దీక్ష విరమించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. వాడు చింతమడక చీటర్.. ఈ మూడు చింతలకు కట్టి చీల్చాలంటూ వ్యాఖ్యానించిన ఆయన.. మూడు చింతలపల్లిలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ఇళ్లే ఉన్నాయన్నారు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికే రోడ్డు పెద్దగా చేసిండు.. రోడ్డుపైకి చేయడంతో ఇళ్లు కిందికి అయిపోయాయని.. వాన కాలంలో వాన నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయిఅని ఆవేదిన వ్యక్తం చేశారు.. ఊరిలో ఇంతవరకు కమ్యూనిటీ…
రేవంత్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు. అనంతరం దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఉత్సహం కనిపిస్తుంది. దళితులకు మూడెకరాలు ఇస్తామని 2014, ఆగస్ట్ 15 న సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. ఆరేండ్లు అయిన.. దళితులకు భూములియ్యలేదు. దళితులకు భూములు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే. టీఆర్ఎస్.. 2018 నుండి ఎక్కడ ఎన్నికలు వచ్చిన డబ్బు వెదజల్లుతుంది…
20 ఏళ్ళు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు. కేసీఆర్ కు 20 నెలల భయం పట్టుకుంది. మొదటి సారి కేసీఆర్ లో భయం కనిపిస్తుంది అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మూడు చింతల పల్లి దీక్ష వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదు. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్…