తెలంగాణలో రాజకీయాలు దళిత, గిరిజనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంద్రవెల్లి ఘటన సాక్ష్యంగా దళిత, గిరిజన దండోర సభ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్కూ అన్యాయం జరిగిందని రేవంత్రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్దేనని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేసి రెణ్నెళ్లకే తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు…
ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ…
ఔను.. వాళ్లిద్దరూ కలిశారు..! అదీ రహస్యంగా..!! తెలంగాణ కాంగ్రెస్లో ఈ సీక్రెట్ భేటీపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట్లో ఉప్పు-నిప్పుగా ఉన్న నాయకులు.. ఒక్కసారిగా హస్తినలో రహస్యంగా సమావేశమై ఏం మాట్లాడుకున్నారు? ఆ బ్యాక్డ్రాప్లో వినిపిస్తోన్న గుసగుసలేంటి? ఎవరు వారు? ఢిల్లీలో రేవంత్, ఉత్తమ్ గంటపాటు రహస్య భేటీ? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఎవరు ఎప్పుడు కలిసి ఉంటారో.. ఎప్పుడు కయ్యాలు పెట్టుకుంటారో తెలియదు. ఇద్దరు కీలక నాయకుల మధ్య తాజా జరిగిన పంచాయితీ ఆ కోవలోకే…
గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత.…
హుజురాబాద్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకున్నరు కేసీఆర్. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది నాతో సహా అని తెలిపారు. ఇక ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో దళిత, గిరిజన దండోరా జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పీసీసీ చీఫ్ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిందనే టాక్ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… వారికి పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ…
కేసీఆర్ సర్కార్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె…
తెలంగాణ కాంగ్రెస్లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది. రేవంత్రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి…