రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు , టిడిపి లేకుండా ఉండడానికి రేవంత్ కారణమని… రేవంత్ ది శనిపాదమని ఫైర్ అయ్యారు. టిడిపిని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ది దొరలపాలన కుటుంబమని.. రేవంత్ ఇంటి ముందు నుంచి దళితులు చెప్పులు వేసుకొని నడవనియ్యరని నిప్పులు చెరిగారు. బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజకీయ నాయకుడు రేవంత్ అని… సమాచార హక్కు చట్టం ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. మల్లారెడ్డి దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నావా లేదా.. ? రేవంత్ కూతురు పెళ్లి మల్లారెడ్డి దగ్గర తీసుకున్న డబ్బులతో చేయలేదా.. ? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ జీవితం మొత్తం బ్లాక్ మెయిల్ అని..దుర్మార్గుడికి పిసిసి ఇచ్చారని నిప్పులు చెరిగారు. బిజెపి పాదయాత్ర ఎందుకు చేస్తోందని.. మొనగాళ్ళు అయితే కేసీఆర్ పెట్టిన స్కీము ను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు మద్దతుగా దళితులు నిలవాలని కోరారు మోత్కుపల్లి.