జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. రేవంత్, కోమటిరెడ్డి మధ్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. దీంతో ఎవరికి తోచినట్టు వారు చేసేస్తుంటారు.. అయితే, కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పార్టీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ముగ్గురు ముఖ్యమేనని మీడియా చిట్‌చాట్‌లో అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి, పీసీసీ కొత్త కమిటీకి గ్యాప్ ఉందని.. కాకపోతే అందరం కలిసి పని చేయాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.
ఇక, పీసీసీపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై నేను పార్టీలో మాట్లాడతానన్న జగ్గారెడ్డి.. మీడియాతో పీసీసీ మీద మాట్లాడ వద్దని సూచన చేస్తానన్నారు.. కోమటిరెడ్డికి బాధ, ఆవేదన ఉందని.. సొంత కొడుకు, సవితి కొడుకు పంచాయతీ ఉంటుందన్నారు. కోమటిరెడ్డికి పార్టీ మీద కోపం ఉంటే పార్టీలో ఉండేవాడు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. కానీ, ఆయనకు పార్టీ మీద ప్రేమ ఉందన్నారు. ఇక, ఎమ్మెల్యే సీతక్క.. చంద్రబాబుకి రాఖీ కట్టడం తప్పుకాదు.. కోమటిరెడ్డి.. వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం కూడా తప్పన్నారు. అయినా.. తప్పు, ఒప్పుల గురించి మాట్లాడే సమయం కాదన్నారు.. వైఎస్ మీద అందరికీ అభిమానం ఉందని.. కొందరు ఆత్మీయ సమ్మేళలానికి వెళ్లారు.. ఇంకొందరు వెల్లలేక పోయారన్నారు. అయితే, రేవంత్, కోమటిరెడ్డికి మధ్య ఉన్న గ్యాప్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తానన్నారు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ లో కొట్లాటలు కామనన్న ఆయన.. హుజురాబాద్ ఎన్నికల వాయిదా… అవగాహనలో భాగమేనని ఆరోపించారు. కేసీఆర్, అమిత్‌షా ముందు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు.. మరి బండి సంజయ్‌కి విలువ ఉన్నట్టా? అని ప్రశ్నించారు. బండి సంజయ్… సీఎం నీ జైల్లో పెడతా అని వంద సార్లు అన్నాడు.. మరి జైల్లో పెట్టించే అమిత్ షా దగ్గర కేసీఆర్ దర్జాగా కూర్చున్నారు.. గల్లీలో మాట్లాడే సంజయ్ మాటలకు విలువ ఉన్నట్టా? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!