తెలంగాణ కాంగ్రెస్లో చేరికలతో ఊపు తెద్దాం అనేది స్ట్రాటజీ. అదే చేరికల అంశంలో సీఎల్పీ నేత భట్టి పంచాయితీ ముగిసిందో లేదో మరో కొత్త రగడ బయకొచ్చింది. గాంధీభవన్లో మాజీ మేయర్ ఎర్ర శేఖర్ చేరిక పూర్తి కాకముందే.. స్టార్ క్యంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎర్ర శేఖర్ చేరికను తప్పు పట్టారు. అధిష్ఠానానికి లేఖ రాయబోతున్నారు కూడా. నేర చరిత్ర ఉన్న వాళ్లను కాంగ్రెస్లో చేర్చుకోవడం ఏంటనే లొల్లి మొదలైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వెనక…
భువనగిరి కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పనులపై అధికారుల్ని ఆరా తీసిన ఆయన.. తనకు పనుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో 140 కోట్ల రైతు బంధు బకాయిలున్నాయని, అలాగే ధాన్యం కొనుగోలులోనూ 30% డబ్బులు చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని అధికారుల్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేశారని, వాటిపై పార్లమెంటరీ…
తెలంగాణ కాంగ్రెస్లో వివాదాలు కామన్. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డం అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం.. భిన్నాభిప్రాయాలు అనే డైలాగులు వినిపిస్తారు. అయితే తరచూ ఇలాంటి అంశాలు చర్చగా మారడంతో.. వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించారా అనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మధ్య సఖ్యత లేదని గుర్తించి.. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడారనే వాదన వినిపిస్తోంది. పార్టీలో ఇటీవల పెద్ద దుమారం రేగింది. పీసీసీ…
రామాయణంలో రాముడికి హన్మంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. తనకు సోనియా గాంధీ గొప్ప అవకాశం ఇచ్చారని.. ప్రధాని, సీఎం పదవుల కంటే పీసీసీ పదవి చాలా గొప్పదని చెప్పారు. జీవితాంతం తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విశ్వాసపాత్రుడిగా పని చేస్తానని తెలిపారు. గురువారం పార్టీలో చేరినవారిని ఘనస్వాగతం పలికిన రేవంత్.. ఈ సందర్భంగా…
తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీలో ఉండే నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టొద్దని సూచించిన ఆయన.. నా అభిమానులు ఎవరు అలా చేసినా పార్టీలో ఉండరు అని హెచ్చరించారు.
కొంతకాలం నుంచి సందిగ్ధతకు తెరదించుతూ.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. అయితే.. ఎర్రశేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించారు. ఈ చేరికకు దూరంగా ఉన్న ఆయన.. నేరచరిత్ర కలిగిన అతడ్ని కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తమ్ముడిని చంపాడన్న ఆరోపణలు…
ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని టీఆర్ఎస్ కొల్లగొడుతోందని, కేసీఆర్ చెప్పినట్టు ‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదని అన్నారు. ధరణి పోర్టల్పై కాంగ్రెస్ అధ్యయనం చేసిందని, ముందే చెప్పినట్టు అందులో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాకు పాల్పడుతోందని.. ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో భూ సమస్యల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. భూముల్ని రైతులు కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకుంటారని, అలాంటి…