తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రియాంక గాంధీ సమాచారం ఇవ్వడంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అయితే.. ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాంత్రం హాజరుకాలేదు. అంతేకాకుండా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ పంపించారు. ఆ లేఖలో ప్రియాంక గాంధీ తో సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు వెంకట్‌రెడ్డి. అంతేకాకుండా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతో పాటు.. ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వివరించారు.
చండూరు లో మీటింగ్, చెరుకు సుధాకర్ జాయినింగ్స్ అంశాల ప్రస్తావించిన వెంకట్‌రెడ్డి.. తన కుటుంబం పై చేసిన కామెంట్స్ ను తెలిపారు. రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేనంటూ తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి కారణంగా తెలంగాణ కాంగ్రెస్ భూస్థాపితమయ్యే అవకాశాలున్నాయని, మరోసారి సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని కొత్త పీసీసీని నియమించాలని ఆయన కోరారు. సాయంత్రం సీల్డ్ కవర్ లో పెట్టీ సోనియా గాంధీ కార్యాలయం లో వెంకట్ రెడ్డి ఈ లేఖను అందజేశారు.