కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సదర్భంగా.. జెండా ఆవిష్కరించి ఆయన పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమం అనంతరం యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పోర్లగడ్డ తండా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అమ్ముడుపోతున్నారని మండిపడ్డారు. వాళ్ళకు గుణపాఠం చెప్పాలని, వాళ్ళను నిలదీయండని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు కలిసిరావాలని పిలుపు నిచ్చారు. మాకు అండగా నిలబడాలి, కమ్యూనిస్టుల కిల్లా నల్లగొండ జిల్లా అంటూ రేవంత్ ప్రస్తావించారు.
ఇప్పుడే మీరు మాతో కలిసి నడవాలని లేకుంటే.. ఇన్నాళ్లు మీరు చేసిన పోరాటాలు వృధా పోతాయని రేవంత్ అన్నారు. కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారమయ్యే వరకు మీతో కలిసి పోరాడుతామని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కొరకు కాంగ్రెస్ పెద్దలను కూడా రంగంలోకి దింపుతానని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు.
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజక వర్గంలో మన మునుగోడు, మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేసారు కాంగ్రెస్ శ్రేణులు. 175 గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆరు మండలాలు, ఒక ప్రతిపాదిత మండల కేంద్రాల్లో జరిగే పాదయాత్రల్లో పీసీసీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పొర్లుగడ్డతండాలో జరిగే పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా మన మునుగోడు – మన కాంగ్రెస్ కరపత్రాలను ప్రతి బూత్‌లో అంటించాలని పార్టీ శ్రేణులకు పీసీసీ నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిదే.
Buddha Venkanna: 420 పార్టీలో విజయసాయి, కొడాలి 840లు..!