ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రెండు పొలిటికల్ పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి.. కాంగ్రెస్. రెండు.. తెలుగుదేశం. కాబట్టి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవి. ఒక పార్టీ మహాఅయితే వరుసగా రెండు సార్లు మాత్రమే గెలిచేది. అందువల్ల పదేళ్ల తర్వాత మరో పార్టీకి ఛాన్స్ వచ్చేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో స్వేచ్ఛగా ఒకరినొకరు విమర్శించుకునేవారు. హస్తం పార్టీలో ఎప్పుడూ రెండు,…
ఆరే ఆరు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. ఇతర నాయకులు నోళ్లు కట్టుకుని కూర్చున్నారు. తమ సహజ శైలికి భిన్నంగా మౌనం దాల్చారు. ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మళ్లీ పూర్వ పద్ధతిలోకి వచ్చేశారు. కాంగ్రెస్‌లో అంతే అనే రీతిలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. నేరుగా పీసీసీ చీఫ్‌కే గురిపెట్టేవారు కొందరైతే.. సీనియరైతే నాకేంటి అనేలా మరికొందరి వైఖరి ఉంది. ఇలాంటి సమస్యలు వస్తే గతంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నవాళ్లు వెంటనే…
ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తాము కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలన్నీ సర్దుకున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో.. మోదీ పర్యటన ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య దోస్తీ బయటపడిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని…
కొంతకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ బేధాలు పూర్తిగా తొలగిపోయాయని సీనియర్ నేత వీ హనుమంతరావు క్లారిటీ ఇచ్చారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీని పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై కూడా స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు అప్పట్లో స్వర్గీయ పీజేఆర్ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని, ఆయన కొడుకుగా విష్ణు వర్ధన్ పార్టీని వీడే ప్రసక్తే లేదని వెల్లడించారు. చచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే విష్ణు కొనసాగుతాడని అన్నారు. విష్ణు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామని తెలిపారు. అయితే..రానున్న కాలంలో పార్టీలో పెద్దఎత్తున చేరికలుంటాయని, ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా లంచ్ కు ఆహ్వానించారని, మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. కాగా..…
సంచలన నిర్ణయానికి ఇంకా సమయం ఉందని.. అది ఏదైనా కాంగ్రెస్ పార్టీ మంచికోసమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి పార్టీ కోసమే మాట్లాడతారని.. పార్టీ ఎదుగుదల కోసమే మాట్లాడతారని ఆయన తెలిపారు. తాను ఏది మాట్లాడినా కాంగ్రెస్ ఎదుగుదల కోసమే మాట్లాడతానన్నారు. పార్టీలో ఉంటాడా.. పోతాడా అనేది మనసులో నుంచి తీసేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు తన వ్యాఖ్యలను నెగెటివ్‌గా తీసుకోవద్దన్నారు. TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు.. జగ్గారెడ్డి ఇక్కడే…