కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ కదం తొక్కుతూ పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో పదోరోజు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. నిన్న శుక్రవారం విశ్రాంతి అనంతరం నేడు భారత్ జోడో యాత్ర ఉదయం 6.30 గంటలకు సంగారెడ్డి జిల్లా చౌటకూరు నుంచి మొదలైంది.
టీఆర్ఎస్ అభ్యర్థికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి మద్దతు ఇచ్చినట్లు కొంత మంది పోస్టులు పెట్టారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి తెరపడనుంది. నేటితో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగయనుంది. సాయంత్రం 6గంటలకు ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.
నేడు హైదరాబాద్లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ సిటీలోకి ప్రవేశించింది.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నేడు తెలంగాణలో రెండోరోజు పాదయాత్ర సాగనుంది. నేడు ఉదయం 6 గంటల 30నిమిషాలకు మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది.