ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అయితే.. దీంతో ఈరోజు ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో.. ‘మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకో , సీఎం దిష్టిబొమ్మల దగ్ధం తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డీసీసీ అధ్యక్షులకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి.. సర్పంచుల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పై టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నా కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతే కాకుండా తెల్లవారు జాము నుంచి టీపీసీసీ అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షులతో సహా ముఖ్య నాయకులను అందరిని గృహ నిర్బంధం చేసి అప్రజాస్వామికంగా, నియంతలాగా పని చేస్తుంది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మల దగ్దం లాంటి కార్యక్రమలు చేయాలని పిలుపునిస్తున్నాము.. ఎత్తున నిరసన చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి’ అని రేవంత్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read : Harish Rao : స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన హరీష్‌రావు
అనంతరం.. రేవంత్ ఇంటి బయటకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ధర్నా చౌక్ లో మీకు అభ్యంతరం ఉంటే అక్కడ అరెస్ట్ చేయండని, ఇంటికి వచ్చి.. బయటకు వస్తే అరెస్ట్ చేస్తా అంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సగం హైద్రాబాద్ కి నేను ఎంపీని, నేను ఎక్కడికి పోతున్న అనేది మీకు అనవసరం, ఇంటి నుండి బయటకు వస్తే కూడా మీ అనుమతి తీసుకోవాలా..? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. విజయారెడ్డి వస్తే అరెస్ట్ ఎందుకు చేశావు. ఇదేం దౌర్జన్యం.. విజయారెడ్డిని వెంటనే విడుదల చేయాలి. సర్పంచులు నిధులు ప్రభుత్వం దొంగతనం చేసింది. కేసు ప్రభుత్వమ మీద పెట్టాలి. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు’ అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే.. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read : Supreme Court: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..