Revanth Reddy: రాహుల్ గాంధీ హెచ్చరించినా.. కేంద్రం పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలోప్రారంభమైన టీపీసీసీ ఒక రోజు శిక్షణా తరగతుల కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు శిక్షణా కార్యక్రమం కొనసాగనుంది. ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహనపై రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనేది చర్చ చేద్దామన్నారు. చైనా భారత భూభాగం అక్రమిస్తున్న మోడీ గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా.. పట్టించుకోలేదు కేంద్రమని అన్నారు. రాజ్యసభలో మహిళ రిజర్వేషన్ బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ దేశం కోసం..జనం కోసం పాదయాత్ర చేశారన్ని అన్నారు.
Read also: Varisu: ‘వారసుడు’ ట్రైలర్ వస్తోంది… యుట్యూబ్ రికార్డ్స్ గల్లంతే
జనవరి 26 తో రాహుల్ యాత్ర ఐపోదన్నారు. పార్టీ తీర్మానం మేరకు ప్రతి ఇంటికి పాదయాత్ర సందేశం వెళ్ళాలని రేవంత్ తెలిపారు. ఎలా తీసుకువెళ్లాలి అనేదానిపై ఇవాళ చర్చ చేద్దామన్నారు. రాష్ట్ర ..కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జీ షీట్ వేయాలన్నారు. 2003 లో ఎలాంటి విపత్కర పరిస్థితి ఉందొ.. 2023 లోకూడా అదే పరిస్థితి ఉందన్నారు. 2003లో కష్టపడినట్టే… ఇప్పుడు కష్టపడి పార్టీని అధికారం లోకి తెద్దామన్నారు. 2003లో చంద్రబాబు కాంగ్రెస్ లేదనే అభిప్రాయం తెచ్చారన్నారు. 2023 లో కేసీఆర్ కూడా అలాగే కలర్ ఇస్తున్నాడని అన్నారు. తెగించి కొట్లాడుదాం.. అధికారంలోకి వద్దామని రేవంత్ పిలుపు నిచ్చారు. బండి.. గుండు ఏం చేయలేరన్నారు. మనలో చిన్న చిన్న సమస్యలు ఉంటే చర్చ చేసుకుందామన్నారు. మనం బాధ్యతగా ముందుకు వెళదామని రేవంత్ పేర్కొన్నారు. సీఎల్పీ.. నేను ఇద్దరం చర్చిస్తమన్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ సదస్సుకు హాజరుకాని నేతలు..
సీతక్క భారత్ జోడో యాత్రలో ఉన్నట్లు తెలిపారు. పార్లమెంటరీ కమిటీ సమావేశానికి వెలుతున్నట్లు ఏఐసీసీకి ఉత్తమ్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కర్ణాటక పార్టీ వ్యవహారాల్లో శ్రీధర్ బాబు ఉన్నట్లు తెలుస్తుంది. సమావేశానికి జగ్గారెడ్డి, మధు యాష్కీ. మహేశ్వర్ రెడ్డి, దామోదర రాజనర్సింహ దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
Tammineni Veerabhadram: దళిత బంధు పథకం నియోజకవర్గానికి 500 సరిపోవు