తెలంగాణలో సర్పంచ్‌ల ధర్నాకు హైకోర్టు అనుమతి నిచ్చింది. తమ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సర్పంచ్‌లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్ సర్పంచ్‌ల సభకు అనుమతిని ఇచ్చింది. సభలో మూడు వందల మందికి మించి ఉండకూడదని తెలిపింది హైకోర్ట్. అయితే.. అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు షరతు విధించింది. ఇదిలా ఉంటే.. “గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మళ్లించిందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తోందని, జనవరి 2న ఇందిరాపార్కు వద్ద సర్పంచ్‌లకు మద్దతుగా కాంగ్రెస్ ధర్నా నిర్వహించేందుకు పిలుపునిచ్చింది.
Also Read : Kollywood: ‘మేకింగ్ మాస్టర్’తో ‘సూపర్ స్టార్’… 32 ఏళ్ల తర్వాత
దీంతో పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసిన తీరుతామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంటి నుంచి బయలు దేరడంతో.. ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో జనవరి 2న నిర్వహించాల్సిన సర్పంచ్‌ల ధర్నా భగ్నం కావడంతో హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో నేడు విచారణ జరిపిన హైకోర్టు సర్పంచ్‌ల ధర్నాకు అనుమతినిచ్చింది.
Also Read : Veera Simha Reddy: ఓవర్సీస్ లో ‘రెడ్డిగారు’ రచ్చ రచ్చ చేస్తున్నారుగా