ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అయితే.. దీంతో ఈరోజు ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా ఉన్న నేపత్యంలో ధర్నాలో పాల్గొనకుండా చేసేందుకు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Malla Reddy: ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ.. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తాం..
ఇప్పటికే ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నా అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేసుకుంటే అనుమతిని పోలీసులు నిరాకరించారు. అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డితో పాటు మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి తదితరులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.