కాంగ్రెస్ వ్యవహారం నచ్చక బీజేపీలో చేరిపోయారు మర్రి శశిధర్‌రెడ్డి. అదేదారిలో మరికొందరు ఉన్నట్లు టాక్. గ్రేటర్లో కాంగ్రెస్ బలహీన పడిందని.. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు. ఒక రకంగా కాంగ్రెస్‌కు లాయలిస్టులుగా పేరు ఉన్నవాళ్లే ఆ పార్టీకి దూరం అవుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి లాంటి నాయకుడిని పార్టీ మారకుండా ఆపడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. మిగిలిన నాయకులు వెళ్లిపోకుండా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గ్రేటర్ హైదరాబాద్ లోనే…
పీసీసీ హోదాలో వున్న రేవంత్ రెడ్డి ఇంటి పెద్దమనిషిగా వ్యవహరించాలని, 24 గంటలు సర్వీస్ ఇవ్వాల్సిందే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటని, అసమ్మతి కాంగ్రెస్ లో సహజమని, అన్ని పార్టీలలో అసమ్మతి ఉంటుందని అన్నారు.
తనదాకా వస్తే తెలియదన్నట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఎఐసీసీ నాయకత్వాన్ని తిట్టినా పట్టించుకునే తీరిక.. ఆలోచన లేదు. ఎవరికి వారు నాకెందుకులే అని వదిలేస్తున్నారట. తిట్టింది నన్ను కాదు కదా అనే భావన మరికొందరిది. తిట్టేవాళ్లు తిట్టని.. పడేవాళ్లు పడని అనుకుంటున్నారో ఏమో.. చివరకు రాహుల్‌గాంధీ మొదలుకొని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరకు అందరినీ దూషించినా ఒక్కరిలోనూ చలనం లేదు. కాంగ్రెస్‌కు లాయలిస్ట్‌గా కొనసాగిన మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ రాహుల్‌గాంధీని, కెసి వేణుగోపాల్‌ను..…
కాంగ్రెస్‌కు ఆపార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. 8 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం కావాలని సత్తుపల్లి నుండి భద్రాద్రి రాములోరు వద్దకు కాంగ్రెస్ నేత మానవతారాయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో డిసెంబరు 12,13 తేదీల్లో పాదయాత్రకి మాజీ ఆత్మకమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ, ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ గాదె చెన్నకేశవరావులు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.
ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు.