Revanth Reddy Demands Police To Arrest KCR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సర్పంచులకు గ్రామాలపై అధికారం అప్పగించింది కాంగ్రెస్ పార్టేనని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక అన్నింటినీ నాశనం చేశారని ఆరోపణలు చేశారు. అధికారాలన్నీ కేసీఆర్ తన చేతుల్లోకి తీసుకున్నారన్నారు. తాను ఉపవాసమైనా ఉంటాను గానీ గ్రామ పంచాయతీల నిధులు ఆపనని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు సర్పంచుల అధికార బాధ్యతల్ని ఎంపీడీఓలకు అప్పగించారన్నారు. నిధులు దారి మళ్లించారని.. ఇది అన్యాయం, అక్రమమని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ సర్పంచుల నిధుల దొంగలించిన ఒక గజ దొంగ అని.. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Perni Nani: తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు.. ఏపీకి ద్రోహం చేశారు
సర్పంచులు రాజీనామాలు చేసే పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్పంచులకు అండగా ఉండి పోరాటం చేస్తామంటే అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తానూ ఒక పెద్ద ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్.. ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇందుకు కేసీఆర్‌కి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. పోలీసులు సైతం దురుసుగా ప్రవరిస్తున్నారని.. అందరినీ తాము గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ శాశ్వతంగా ఉంటారని అనుకోవద్దని, ఆయన ఉండేది ఇంకో ఎనిమిది నెలలేనని పోలీసుల్ని సూచించారు. తాము కోర్టుకి వెళ్తామని, కోర్టు అనుమతితో ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తామని తేల్చి చెప్పారు. సర్పంచులంరూ రోడ్డెక్కి.. మంత్రుల చొక్కాలు పట్టుకొని నిలదీయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Elon Musk: మస్త్ సమస్యల్లో మస్క్.. ఆఫీసు అద్దె చెల్లించలేదని కేసు
పోలీసులందరూ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్హత లేకున్నా.. అంజనీ కుమార్‌కు కేసీఆర్ డీజీపీ పదవి ఇచ్చారన్నారు. తమని అరెస్ట్ చేయమని డీజేపీకి కేసీఆర్ న్యూ ఇయర్ నయరాజా ఇచ్చారని ఆరోపణలు చేశారు. డీజీపీ చట్టాన్ని గౌరవించాలే గానీ, కేసీఆర్‌ని సంతోషపెట్టే పని చేయొద్దని హితవు పలికారు. తన పార్టీ పేరు మార్చుకున్నప్పుడే.. కేసీఆర్‌కు తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్ అంటే బిహార్ రాష్ట్ర సమతి అని అభివర్ణించారు. అందుకే కేసీఆర్ బీహార్ వాళ్లనే తెచ్చుకున్నారన్నారు. కేసీఆర్, బీజేపీ ఒకటేనని.. ఇద్దరూ బెంగాల్ తరహా రాజకీయాలకు తెరలేపారన్నారు. కేసీఆర్ నిధులు మళ్లిస్తే.. కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్
అయ్యప్పస్వామిని కించపరిచిన వ్యవహారంలోనూ రాజకీయ కుట్ర ఉందని.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈ కుట్ర పన్నాయని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. డిసెంబర్ 19న అతడు మాట్లాడితే.. ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వందల కోట్ల కాంట్రాక్టు పనులు ఇచ్చారని.. వీటిపై విచారణ జరపాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్‌లో చేరిన వాళ్లకు తాడు బొంగరం కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్నోళ్లకే అపాయింట్‌మెంట్ లేదని, అలాంటప్పుడు చేరిన వాళ్లకు ప్రాధాన్యత ఏముంటుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.