సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు ఎండనక, వాననక కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతును దగా చేస్తుంటే.. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చోద్యం చూసోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. పంట ఏదైనా వ్యాపారులు, దళారులు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మద్దతు ధర అంటూ రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య ఉన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే… రైతులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? వానలు, చీడపీడల బెడదను తట్టుకుని పండిన పత్తిని చూసి రైతాన్న అనందం మార్కెట్లో ధర చూడగానే ఆవిరైపోతుంది. దళారులు రాజ్యంలో గిట్టుబాట ధర రాకపోవడంతో రోడ్డెక్కి ఆందోళ చేయాల్సిన స్థితి దాపురించింది. క్వింటాలుకు రూ.6-7 వేలు చెల్లిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడిని పరిగణనలో తీసుకుంటే కనీసం రూ.15 వేలు రాకుంటే గిట్టుబాటు కాని పరిస్థితి.
Also Read : Flexi war between YCP leaders: అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు.. న్యూ ఇయర్ ఫ్లెక్సీ వార్..
మరోవైపు రాష్ట్రంలో రైతులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు. సరైన వ్యవసాయ విధానం లేకపోవడం, పంటల ప్రణాళిక లేకపోవడం, రైతులకు దిశానిర్దేశం చేసే వ్యవస్థలు కుంటుపడిపోవడం, రుణ ప్రణాళికలు సరిగా అమలు చేయకపోవడం, సరైన విత్తనాలు, పురుగు మందుల సరఫరా చేయలేకపోవడం ప్రకృతి విపత్తుల సమయంలో భరోసా ఇవ్వలేకపోవడం, తెగుళ్లు సోకి పంట నష్టం జరిగినప్పుడు పరిహారానికి భరోసా లేకపోవడం వంటి అనేక కారణాలు వ్యవసాయాన్ని, రైతును సంక్షోభంలో పడేశాయి.
Also Read : New Covid Variant: భారత్లోకి కొత్త కోవిద్ వేరియంట్.. గుజరాత్లో మొదటికేసు
మీ విధానాల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలు చెబుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత 2014 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,557 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఏడాదిలో నవంబరు దాకా అంటే 11 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ చేసిన అధ్యయనం తేల్చింది. మొత్తంగా 2014 నుంచి చూస్తే గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 7,069 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.’ అంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.