కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని కాంగ్రెస్‌లో కీలక నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో.. నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.