నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతిభవన్పై వాఖ్యలపై స్పందించిన మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. 2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న ములుగులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తుంది.
రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.