హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొండగట్టుకు తక్షణం 500 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలోనే ప్రసస్థమైన దేవాలయం కొండగట్టు అని ఆయన అన్నారు. అంజన్న ఆశీర్వాదం తీసుకొని 4 కోట్ల ప్రజలకు మేలు జరిగేలా కోరుకోవడం జరిగిందని, గుడిలో ఉన్న పూజారులను భక్తులను, కొండగట్టు అంజన్నను అబద్ధాల వాగ్ధానాలతో మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Also Read : Kishan Reddy : బాలుడి మృతికి జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం
కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి..125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేసిందని, తండ్రి, కొడుకు, కూతురు, దేవుళ్లను కూడా మోసం చేశారని ఆయన అన్నారు. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. 800 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాపాడాలని ఆయన అన్నారు. గతంలో బస్సు ప్రమాదం జరిగి.. 70 మంది చనిపోయారని ఆయన అన్నారు. బస్సు బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని ఆయన మండిపడ్డారు. తూతూ మంత్రంగా ఆర్ధిక సాయం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండగట్టును అభివృద్ధి చేస్తామన్నారు.
Also Read : MLA Jagga Reddy : వీఆర్‌ఏల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ