MLA Ravi Shankar: రవిశంకర్ సవాల్.. రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sunke Ravi Shankar Challenges Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సవాల్ విసిరారు. కొండగట్టులో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగధర మండలం మధురానగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసింది పాదయాత్ర కాదని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసింది పాదయాత్రనా? లేక బస్సు యాత్రనా? అనేది జనాలకి ఇంకా కన్ఫ్యూజన్‌గానే ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టుని అభివృద్ధి చేసిందని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, అసలేం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కొండగట్టుకి వెయ్యి కోట్లు కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
Raja Singh: నకిలీ సర్టిఫికెట్ల వెనుక MIM కుట్ర ఉంది.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని రేవంత్‌రెడ్డి ‘బలి దేవత’గా అభివర్ణించారని రవిశంకర్ గుర్తు చేశారు. ఇప్పటికీ చంద్రబాబు తొత్తుగా, బినామీగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బస్సులో పాదయాత్ర చేస్తున్నాడని, ఈ యాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు.. కొండగట్టుకి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం నీటితో చొప్పదండి నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యిందన్నారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదని, అసలు ఎలాంటి సమాచారమూ అందించడం లేదని పేర్కొన్నారు.
చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యిన స్టార్ హీరోయిన్లు వీరే..
కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించామని రవిశంకర్ తెలిపారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాల గురించి తెలుకోవాలని, చత్తీస్‌గఢ్ పథకాలు గురించి సభలో వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో మేడిపల్లి సత్యంకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని, అసలు కాంగ్రెస్‌లో ఐక్యతే లేదని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి గంగాధరకి వచ్చి, అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయలేదన్నారు. రేవంత్‌కి దళితులంటే గౌరవం లేదన్నారు. రూ.1000 కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రవిశంకర్ మాటిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలో స్థానికులకు మాత్రమే అవకాశం ఇచ్చి గెలిపిస్తారని వెల్లడించారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా సరికొత్త సంచలనం.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్
తాజావార్తలు
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!