కరీంనగర్‌లో కాంగ్రెస్ కరీంనగర్ కవాతు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బగేల్ హాజరయ్యారు. ఈ సభకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఆది శంకరాచార్య తరువాత దేశమంతా తిరిగిన వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. విద్వేషాన్ని వీడి దేశ సమైక్యతను కాపాడాలని రాహుల్ సందేశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు చూసి ఇక్కడి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మేమంతా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలను బొంద పెట్టాలని ఆయన అన్నారు. ఛత్తీస్ ఘడ్ మాదిరిగా మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామన్న ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆ హామీని గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు.
Also Read : Punjab: ఖరీదైన మందులను నియంత్రించేందుకు తీర్మానం.. అసెంబ్లీ ఆమోదం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు రూ. 3000 భృతి అందిస్తుందని ఆయన అన్నారు. అనంతరం భూపేష్ బగేల్ మాట్లాడుతూ.. ఎప్పుడెప్పుడు కరీంనగర్ గుర్తుకు వస్తుందో.. అప్పుడు కచ్చితంగా ఛత్తీస్ ఘడ్ గుర్తుకు వస్తుందన్నారు. తెలంగాణ వచ్చింది.. రైతులకు ఏం ఒరిగింది, నిరుద్యోగులకు ఉపాధి దొరికిందా? అని ఆయన అన్నారు. కేటీఆర్, హరీష్, లిక్కర్ క్వీన్ కవితలకు ఉపాధి దొరికిందని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read : Punjab: ఖరీదైన మందులను నియంత్రించేందుకు తీర్మానం.. అసెంబ్లీ ఆమోదం
బీజేపీకి గుజరాత్ మోడల్ చూపిస్తుందని, మేము చెప్తున్నం… ఛత్తీస్ ఘడ్ మోడల్ ప్రజలది అన్నారు. బ్యాంకుల్లో డబ్బులు ఒకరిద్దరికి దోచిపెట్టడం గుజరాత్ మోడల్ అని ఆయన విమర్శించారు. తెలంగాణలోని5 వేలు రైతు బంధు ఇస్తున్నారు.. మేము 9 వేలు ఇస్తున్నామన్నారు. వరికి కనీస మద్దతు ధర తెలంగాణలో 2060 కింటల్ కి ఇస్తున్నారని, ఛత్తీస్ ఘడ్ లో 2640 రూపాయలు వరి ధాన్యానికి ఇస్తున్నామన్నారు. మేము ఛత్తీస్ ఘడ్ లో ఆవు పేడ, గో మూత్రం కూడా కొంటున్నామని, మేము నిరుద్యోగులకు 2500 నిరుద్యోగులకు భృతి ఇస్తున్నామన్నారు.