కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హాత్ సే హాత్ జోడో యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమం కొనసాగుతోంది. 19వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అయితే.. నిన్న హుస్నాబాద్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అన్నారు. కేసీఆర్, వినోద్ ఎంపీలు అయిన తెలంగాణ రాలే అని, పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీ అయి తెలంగాణ తెచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బయ్యారం ఉక్కు కార్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ఏమైనా చేశాడా. ఈ విషయంలో పొన్నంతో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ఫిరాయింపులతో తెలంగాణలో బీజేపీ విజయం సాధించలేదని, సర్దార్ సర్వాయి పాపన్న వారసులు ఈ గడ్డ మీద ఉన్నారన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 45 లక్షల కేంద్ర బడ్జెట్‌లో ఒక్క రూపాయి అయిన ప్రత్యేకంగా తెలంగాణకు మోడీ గారు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. మోదీ 9 ఏళ్లలో రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేయరు.
Also Read : Global Investors Summit 2023: సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి..
అదానీ, అంబానీలకు రూ. 12 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ లెక్కన తెలంగాణలో మోదీ 70లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. అదే జరిగితే తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావు. 21కోట్ల దరఖాస్తులు వస్తే..7లక్షల 164 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో నిస్సిగ్గుగా చెప్పారు. బండి సంజయ్ గెలిచి బీజేపీకి అధ్యక్షుడి అయ్యావు. తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదు. ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ రావొద్దు. గౌరెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. కుర్చీ వేసుకొని గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేసాడు. ఫామ్ హౌస్లో మందు ఏస్తుండు. మీకు ఇష్టం లేకున్నా మీ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు. ఇంత అన్యాయం ఉంటుందా. హరీష్ రావు నీవు చేసిన ఈ పాపానికి సతీష్ బాబుకు డిపాజిట్ దక్కదు.
Also Read : Watchman attack on Constables: డయల్ 100కి కాల్.. పోలీసులు రాగానే దాడి..!
కేసీఆర్ అపాయింట్ మెంట్ ఎవరికి దక్కదు. కానీ సతీష్ బాబు ఇంటికే కేసీఆర్ వస్తారు. కేసీఆర్ దగ్గరి మీ సమస్యల గురించి ప్రస్తావించని సతీష్ బాబు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం లేదు. హుస్నాబాద్ అభివృద్ధి చెందాలన్నా, మీ నియోజకవర్గాన్ని కరీంనగర్లో కలపాలన్నా హుస్నాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు.’ అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.