హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రస్తుం కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన పాదయాత్రలో రేవంత్ రెడ్డ మాట్లాడుతూ… కరీంనగర్ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే గడ్డ కరీంనగర్ అని అన్నారు. కరీంనగర్‌లో తెలంగాణ ఇస్తా అని మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరు కొట్లడలే అని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదన్నారు. ఎమ్మేల్యే అయినంక కేసీఆర్ సంగతి తెల్చుతనన్న ఈటల రాజేందర్ కేసీఆర్ పై ఒక్క ఫిర్యాదు కూడా ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మానేర్ నుండి ఇసుక అక్రమంగా తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గా ఉండి ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు.
Also Read : Off The Record: పాయకరావుపేటలో పాగా వేస్తారా?
అంతేకాకుండా.. ‘పార్లమెంట్ లో బీజేపీకు బీఆరెఎస్ ప్రభుత్వం అండగా ఉండి బిల్లులు పాస్ చేసింది వాస్తవం కాదా. బీజేపీ నాయకులు రాష్ట్రం లో టీఆరెఎస్ పార్టీ చేసే అవినీతి పై ఎప్పటిలోగా విచారణ చేస్పిస్తారో చెప్పాలి. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ లు రెండు ఒక్కటే. మాట ఇస్తే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ లో 24 గంటలు ఉచితం గా విద్యుత్ ఇస్తే మేము రాబోయే ఎన్నికల్లో పోటీ చేయం. బలహీన వర్గాలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వస్తే నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వస్తె 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. 2 లక్షల రుణ మాఫీ 2 లక్షల ఉద్యోగాల భర్తీ , 5 లక్షల రూపాయలు ఆరోగ్య శ్రీ ఇవ్వాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. హుజూరాబాద్ నియోజక వర్గం లో బల్ముర్ వెంకట్ ను గెలిపించి అసెంబ్లీ కి పంపండి హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Off The Record: లాబీయింగ్ వర్కవుట్ అయ్యేనా?
అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మేల్యే గాగెలిచిన ఈటల రాజేందర్ పెట్రోల్ ,గ్యాస్ తగ్గించగలగరా. కేంద్రం పెంచిన 50 రూపాయల గ్యాస్ ధరను రాష్ర్ట ప్రభుత్వం భరించి ప్రజల పై భారం పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్న. 2014 లో డబుల్ బెడ్ రూం కు ఐదు లక్షలు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు మూడు లక్షలు అంటున్నడు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఇస్తా అని కేవలం నోటిఫికేషన్ వరకే పరిమితమయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా మొత్తం బలహీన వర్గాలకు మోసం చేసింది కేసీఆర్. హుజూరాబాద్ ను జిల్లా గా చేస్తే ఎవరు అడ్డు వచ్చారో చెప్పాలి.’ అని డిమాండ్ చేశారు.
Also Read : G20: ప్రతీకారం కోసం పాశ్చాత్య దేశాల ప్రయత్నం.. రష్యా ఘాటు వ్యాఖ్యలు..