Indian Currency Look: ప్రస్తుతం మన కరెన్సీ నోట్ల పైన ఒక వైపు జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ, మరోవైపు చారిత్రక కట్టడాల బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్ల లుక్ భవిష్యత్‌లో మారనుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు ప్రతిరూపంగా పూజించే లక్ష్మీదేవితోపాటు కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించే గణేషుడి బొమ్మలు వస్తాయా అని ప్రజలు అనుకుంటున్నారు.
‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు.
Seva Vikas Co-op Bank: దేశంలో మరో బ్యాంక్ కథ ముగిసింది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్` లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం ప్రటించింది.
House EMI: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేటును సమీక్షించిన కొద్ది గంటల్లో పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచేశాయి. కీలక రెపో రేటును ఆర్‌బీఐ అరశాతం పెంచింది. దీంతో సామాన్యులకు మరో షాక్ తగిలినట్లు అయ్యి్ంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు…
ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు వాడడం సర్వసాధారణమైపోయింది. క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి జులై 1 నుంచి ఆర్‌బీఐ కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్నింటి గడువును అక్టోబర్ 1 వరకు పొడిగించింది.
RBI-Card Tokenisation: కార్డ్ టోకెనైజేషన్ కోసం విధించిన డెడ్‌లైన్ రేపు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించే ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేనట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్ పొడిగించాలని చిన్న వ్యాపారుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్ర బ్యాంకు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలేవీ ఇప్పటివరకు వెలువడలేదు. కార్డ్ డేటాను భద్రపరచడానికి ఆర్బీఐ ఈ భారీ కసరత్తును మూడేళ్ల కిందటే ప్రారంభించింది.
RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్‌గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది.
Reserve Bank Of India: నిత్యావసర ధరల పెంపుతో అల్లాడుతున్న సామన్యులపై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. త్వరలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంటుందని తెలుస్తోంది. ఈనెల 30న ఆర్‌బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేట్లను ఆర్‌బీఐ పెంచనుంది. ఇప్పటికే గత రెండు సమీక్షల్లో వరుసగా వడ్డీరేట్లను ఆర్‌బీఐ పెంచింది. ఇదే జరిగితే…