New Rules: ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు వాడడం సర్వసాధారణమైపోయింది. క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి జులై 1 నుంచి ఆర్‌బీఐ కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్నింటి గడువును అక్టోబర్ 1 వరకు పొడిగించింది. ఇందులో ఒకటి క్రెడిట్ కార్డు యాక్టివేషన్‌కు సంబంధించింది. ఒకటో తేదీ నుంచి క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. కార్డు జారీ చేసేముందు కార్డుదారుడి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా అనుమతి పొందకుంటే అక్కడికి వారం రోజుల్లో కార్డును బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారుల అంగీకారం లేకుండా కార్డు లిమిట్‌ను కూడా పెంచొద్దని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
ఆన్‌లైన్ లావాదేవీల భద్రతను మెరుగుపరచడానికి ఆర్‌బీఐ కార్డ్ టోకనైజేషన్ సంస్కరణను తెచ్చింది. ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీల్లో టోకనైజేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది. మర్చంట్ వెబ్‌సైట్‌లో లావాదేవీ చేస్తున్నప్పుడు చెక్అవుట్ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం మీ కార్డును భద్రపరచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ఎంచుకున్నప్పుడు సురక్షిత టోకెన్ నెంబర్‌ను ఇస్తే సరిపోతుంది. దీనివల్ల వాస్తవ కార్డ్ వివరాలకు బదులుగా సదరు మర్చెంట్ డేటాబేస్‌లో ఈ టోకెన్ నెంబర్ స్టోర్ అవుతుంది. దీన్ని ఎంచుకోనిపక్షంలో కార్డ్ వివరాలు సేవ్ అవ్వవు. దానితో ఇబ్బందేమీ ఉండదు. అయితే నిర్దిష్ట వెబ్‌సైట్‌లో లావాదేవీ చేయడానికి మీరు మీ కార్డ్‌ని ఉపయోగించిన ప్రతిసారీ పూర్తి కార్డ్ వివరాలను నమోదు చేయాలి. టోకనైజేషన్ అంటే నిజమైన కార్డ్ వివరాలకు బదులుగా “టోకెన్” అని పిలిచే ప్రత్యామ్నాయ కోడ్‌తో భర్తీ చేయడమే.
5G services: టెలికాం రంగంలో కొత్త శకం.. 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని
ఇకపోతే ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు టోకెనైజేషన్ తప్పనిసరి. నేటి నుంచి అనగా అక్టోబర్ 1 నుంచి ఈ నియమం వర్తిస్తుంది. కార్డు వివరాలను వెల్లడించకుండానే కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించొచ్చు. దీని కోసం కార్డులకు ఒక ప్రత్యేకమైన నెంబర్ లేదా టోకెన్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఈ నెంబర్ ఇవ్వడం ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. కార్డు అసలు వివరాలు తెలియజేయాల్సిన పని లేదు. డేటా సెక్యూరిటీ లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ రూల్స్ తెచ్చింది. ఆర్‌బీఐ 2019లోనే ఈ రూల్స్ తెచ్చింది. అయితే తర్వాత చాలా సార్లు టోకెనైజేషన్ అమలును పొడిగిస్తూ వచ్చింది. నేటి నుంచి ఈ నియమాలను అమలు చేయనున్నారు. అలాగే కొత్త రూల్స్ ప్రకారం ప్రతి కార్డుకు టోకెనైజేషన్ తప్పనిసరి. అలాగే మర్చంట్లు, ఇతర వెబ్‌సైట్లు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదు. దీని వల్ల కార్డు ద్వారా నిర్వహించే లావాదేవీలకు మరింత భద్రత లభిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ఆర్‌బీఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.