‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు. ఎక్కువ మంది ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి, ట్యాక్స్ పరిధిలోకి రావటం వల్ల పన్నులను ఎగవేసేవారి సంఖ్య తగ్గిందని, దీని వల్ల పన్నుల రేట్లను సైతం తగ్గించే స్థితికి మన దేశం వచ్చిందని ఆషిమా గోయెల్ వివరించారు.
బ్లాక్ మనీ చెలామణికి చెక్ పెట్టేందుకు, డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేసేందుకు, ఎకానమీలో ట్రాన్స్‌పరెన్సీని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను తెచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల అప్పట్లో చాలా మంది క్యాష్ దొరక్క అష్టకష్టాలు పడ్డారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇలాంటి స్వల్ప కాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ పెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ మధ్యకాలంలోనే తెలిసొస్తున్నాయని ఆషిమా గోయెల్ వెల్లడించారు.
Diwali Sanctions In Vizag: విశాఖలో అక్కడ దీపావళి వేడుకలు నిషేధం.. ఎందుకో తెలుసా?
పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే లాభాలను ప్రజలు రానున్న రోజుల్లో మరింతగా అనుభవంలోకి తెచ్చుకుంటారని చెప్పారు. నగదు వాడకాన్ని ఇంకా తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేనున్న విషయాన్ని ఆషిమా గోయెల్ ప్రస్తావించారు. ఈ నెల 9వ తేదీ నాటికి కార్పొరేట్ మరియు పర్సనల్ (స్థూల) పన్ను వసూళ్లు సుమారు 24 శాతం పెరిగి దాదాపు 9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో జీఎస్‌టీ కలెక్షన్లలో 26 శాతం గ్రోత్ నమోదైంది. మొత్తం వసూళ్లు కోటీ 47 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా ఏడో నెల కూడా జీఎస్‌టీ కలెక్షన్లు 1.40 లక్షల కోట్లను దాటడం విశేషం.