RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్‌గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది. వెయ్యి నుంచి 10 వేల కోట్ల రూపాయల లోపు డిపాజిట్లు కలిగిన టయర్-3 బ్యాంకులు ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటి లోపు అమలుచేయాలని గడువు విధించింది. టయర్-1, టయర్-2 బ్యాంకులకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
5 ఏళ్లలో 35 వేల కోట్లు
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 5 ప్రధాన ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తిచేసేందుకు 35 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నట్లు నుమాలీగఢ్ రిఫైనరీ వెల్లడించింది. ఈ ఐదు ప్రాజెక్టుల్లో ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్‌లైన్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. దీర్ఘకాల వ్యాపారాభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ చైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రథ్ తెలిపారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశం అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.
Tollywood Trends-2: టైటిల్ ఒక్కటే.. సినిమాలే వేరు..
ఇథనాల్ రేటు పెంపు
అన్ని కేటగిరీల్లో ఇథనాల్ కొనుగోలు ధరను వచ్చే సీజన్ నుంచి లీటర్‌కి రెండు రూపాయల వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త రేట్లు 2022-23 సీజన్‌లో అంటే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ మధ్య కాలంలో అమల్లో ఉంటాయని తెలుస్తోంది. మన దేశం 2025 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమ ఆటో ఇంధనాన్ని వినియోగించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం 8 శాతం ఇథనాలే కలుపుతున్న సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 547 పాయింట్లు లాభపడి 59688 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 17804 పైనే కొనసాగుతోంది. బంగారం రూ.49259 వద్ద, వెండి రూ.56,582 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. రూపాయి విలువ 7 పైసలు పెరిగి 79.52 వద్ద నిలకడగా ఉంది.