రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ కార్డులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. పేమెంట్స్ డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా గతేడాది మాస్టర్ కార్డులపై ఆంక్షలు విధించామని.. దీనిపై మాస్టర్ కార్డు యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తిగా ఉండటంతో ఆంక్షలు ఎత్తేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించించి. ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేయడంతో కొత్త కార్డుల జారీ త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాగా పేమెంట్స్‌కు సంబంధించిన డేటా భద్రపరచాలని 2018…
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ డైరెక్టర్లుగా పలు పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులను ప్రభుత్వం నియమించింది. ఆర్‌బీఐ డైరెక్టర్‌గా ఆనంద్ మహీంద్రాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. అయితే ఆనంద్ మహీంద్రాతో పాటు.. రవీంద్ర ధోలాకియా, వేణు శ్రీనివాసన్, పంకజ్ పటేల్‌లను కూడా ఆర్బీఐ డైరెక్టర్లుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త అపాయింట్‌మెంట్‌లు నాలుగు సంవత్సరాల పాటు ఉంటాయి. కేంద్ర క్యాబినెట్…
దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఎన్టీఆర్ బొమ్మను రూ.100 నాణెంపై ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 నాణెం వాడుకలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. Andhra Pradesh: వాట్సాప్‌తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్…
డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఖాతాలకు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూపే కార్డులతో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. దీని వల్ల వినియోగదారులు మరింత సులువుగా పేమెంట్స్ చేసుకునే వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సి ఉందని చెప్పింది. యూపీఐలతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు…
ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరో సారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును పెంచి 4.90 శాతంగా ప్రకటించింది.రెపో రేటు లేదా తిరిగి కొనుగోలు చేసే ఎంపిక రేటు…
కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తొలగింపు వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మా గాంధీ బొమ్మను మార్చబోమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ స్థానంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఫొటోలను ముద్రించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన సోమవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. కరెన్సీ నోట్లపై ఇతరుల ఫోటోలు ముద్రించాలన్న కొత్త…
దేశంలో ఇప్పటివరకు మన కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మ గాంధీ ఫోటోలను మాత్రమే ఆర్‌బీఐ ముద్రించింది. అయితే కరెన్సీ నోట్లపై తాజాగా మరో ఇద్దరు ప్రముఖుల చిత్రాలు ముద్రించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫొటోలను కొత్తగా విడుదలయ్యే కొన్ని డినామినేషన్ నోట్లపై ముద్రించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించినట్లు తెలుస్తోంది. Secunderabad Railway Station: అడల్ట్ కంటెంట్‌లో టాప్.. మొత్తం…
వివిధ లావాదేవీలపై బ్యాంకులకు వచ్చే కస్టమర్లతో ఎలా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలనే హైదరాబాద్‌లో దానిపై రిజర్వు బ్యాంక్ అధికారులకు శిక్షణ శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా శిబిరం 3 వారాల పాటు సాగనుంది. అయితే.. న్యాయ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఆర్బీఐ ఉద్యోగుల ముఖ్య విధి అని ఆయన…
క్రెడిట్ కార్డుల జారీని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరింత కట్టుదిట్టం చేసింది. కస్టమర్ల సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని అన్ని బ్యాంకులు, కంపెనీలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ విషయాన్ని ఉల్లంఘిస్తే కస్టమర్ నుంచి వసూలు చేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులకు సంబంధించి రుణాల వసూలు కోసం సంస్థలు కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదని…
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా 11వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం వల్ల ఇండ్ల కొనుగోలుదారులకు తక్కువ వడ్డీరేట్లకే ఇంటి రుణాలు లభించనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ముగిసిన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని…