రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 5న నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు.
RBI Update On RS. 2000 Notes: 2023 మే 19న రద్దు చేసిన 2000 రూపాయల గులాబీ నోట్లపై ఆర్బీఐ కీలక అప్డెట్ విడుదల చేసింది. ఇంకా ప్రజల నుంచి ఈ నోట్లు పూర్తిగా ఆర్‌బీఐకి చేరలేదని తెలిపింది. మూడు సంవత్సరాలకు పైగా గడిచినా..5,817 కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన ప్రకారం.. డీమోనిటైజేషన్‌కు అనంతరం 98.37% నోట్లు…
ఈజీమనీకి అలవాటు పడిన కొందరు దొంగనోట్ల ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చలామణికి పాల్పడుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దొంగనోట్లు తీవ్ర కలకలం రేపాయి. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. కూరగాయలు అమ్మే వృద్దులే టార్గెట్ గా దొంగ నోట్ల చెలామణికి పాల్పడుతోంది ముఠా. ఒకే…
డబ్బులు అర్జెంటుగా అవసరంపడినప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వద్ద అడుగుతారు. డబ్బు దొరక్కపోతె బ్యాంకులో లోన్ తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. కానీ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అంత ఈజీగా లోన్స్ ఇవ్వవు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే లోన్స్ మంజూరు చేస్తుంటాయి. లేదంటే లోన్ అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఇదే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మొదటి సారి లోన్లు తీసుకునేవారికి మినిమమ్ సిబిల్ స్కోర్ ఉండాల్సిన అవసరం లేదని లోక్‌సభలో ఆర్థిక…
రూ.500 నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి బంద్ చేస్తారన్న అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చింది. ఈ ఫేక్ ప్రచారం పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. రూల్స్ పాటించని బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతు లైసెన్స్ లను రద్దు చేస్తుంది. భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర బ్యాంక్ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బిగ్ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్ వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.75 లక్షల జరిమానా విధించింది. Also Read:Shraddha Das : అందాలతో ఘాటు పెంచేసిన శ్రద్ధా…
ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము. అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరుగెత్తుతుంటారు. కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకివ్వబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోందని సమాచారం. గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ. ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీకాదు అంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం ఏంటి? కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అకౌంట్ హోల్డర్లకు క్వాలిటీ సర్వీసెస్ అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, శాలరీ ఇలా రకరకాల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అయితే ఖాతా తెరిచే సమయంలో చాలా మంది నామినీని చేర్చకుండా వదిలేస్తుంటారు. దీని వల్ల ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంక్ ఖాతాలపై కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ లో…
మార్కెట్ లో నకిలీ నోట్ల బెడద ప్రజలను కలవరపెడుతున్నది. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు దొంగ నోట్లను ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో దొంగ నోట్ల తయారీ కలకలం రేపిన విషయం తెలిసిందే. రూ.500 ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. ఇప్పుడు రూ.…
Shaktikanta Das: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజు ( డిసెంబర్ 10) తన పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.