Seva Vikas Co-op Bank: దేశంలో మరో బ్యాంక్ కథ ముగిసింది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్` లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం ప్రటించింది. ఆ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. దీంతో కస్టమర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఆర్‌బీఐ ఇప్పటికే పలు కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read Also: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో ఖాళీల భర్తీ
ది వికాస్ కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద సరిపడా పెట్టుబడి, ఆదాయ మార్గాలు లేవని పేర్కొంటూ ఆర్బీఐ ప్రకటించింది. సోమవారం నుంచి బ్యాంకింగ్ బిజినెస్ లావాదేవిలు మూసేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. కస్టమర్లు ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ సేవలు పొందలేరు. దీని వల్ల బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) (డీ), సెక్షన్ 56 ప్రకారం ఈ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నామని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే బ్యాంక్ సెక్షన్ 22(3)(ఏ), 22(3)(బీ), 22(3)(సీ), 22(3)(ఇ) వంటి నిబంధనలను కూడా అతిక్రమించిందని వెల్లడించింది.
Read Also: Flipkart Diwali Sale: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ఆ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం 99శాతం డిపాజిటర్లు ఇన్సూరెన్స్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) ద్వారా పూర్తి డిపాజిట్లు పొందుతారు. సెప్టెంబర్ 14న డీఐసీజీసీ ఆధ్వర్యంలో ఇన్సూర్డ్ డిపాజిట్ల ఆధారంగా రూ.152.36కోట్లు చెల్లించింది. రూ. 5 లక్షల వరకు డబ్బులు దాచుకున్న వారికి పూర్తి డబ్బులు లభిస్తాయి. ఆపైన డిపాజిట్ చేసుకొని ఉంటే.. వారికి కూడా రూ. 5 లక్షల వరకే వస్తాయి. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునేటప్పుడు దాని ఆర్థిక పరిస్థితులు కూడా గమనించాలి. లేదంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.