Budget and Startups: 2022వ సంవత్సరంలో ఇండియన్ స్టార్టప్‌ల వ్యవస్థ కొంచెం గాడి తప్పింది. నిధులు నిండుకోవటంతో తిరోగమనంలో పయనించింది. ఈ ఫండింగ్ సమస్య వల్ల స్టార్టప్‌లకు ఆశాజనకమైన పరిస్థితులు కరువయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు డబ్బు ఇచ్చేందుకు ముందుకురాలేని ప్రతికూల పరిణామాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్-2023.. ఇండియన్ స్టార్టప్‌లకు ఎలాంటి భరోసా ఇస్తుందోనని సంబంధిత వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
Gold and Silver Markets: బంగారం, వెండి బిజినెస్ కొత్త సంవత్సరంలో ఆశాజనకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 2022 కంటే 2023లో బులియన్ మార్కెట్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోయినేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువ ఒడిదుడుకులే ఉంటాయని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ వ్యాల్యూ అత్యధికంగా దాదాపు 19 వందల 35 డాలర్లకు చేరుతుందని, తక్కువలో తక్కువ 16 వందల 30 డాలర్ల కన్నా దిగొచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు.
RBI Governor on CryptoCurrencies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు వాటి వల్ల దేశానికి, ప్రజలకు ఏంటి ఉపయోగం అని నిలదీశారు. పైసా కూడా ప్రయోజనంలేని ఇలాంటివాటిని ఇంకా ప్రోత్సహిస్తే మరో ఘోర ఆర్థిక మాంద్యానికి దారితీయక తప్పదని హెచ్చరించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలని, క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేయకపోతే తాను చెప్పింది జరిగి తీరుతుందని బల్ల గుద్ది చెప్పారు.
Andhra Pradesh: ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా ఏపీ ఇప్పటికే అప్పులు ఎక్కువగా చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేక డ్రాఫ్టింగ్ సదుపాయం, చేబదుళ్ల పరిమితి దాటిపోవడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్‌లోనే డిసెంబర్ నెల గడిచిపోతుందని.. ఇప్పటికైనా మేలుకోకపోతే ఓడీ పీరిమితిని కూడా రాష్ట్రం దాటిపోతుందని ఆర్‌బీఐ హెచ్చరించింది. ఈనెల 8 వరకు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉంది. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఇంకా పలువురు ఉద్యోగులకు…
వడ్డీ రేట్లను పెంచుతూ షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇదే సమయంలో ఓ గుడ్‌న్యూస్ కూడా చెప్పింది.. ఆన్‌లైన్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే ఆప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్తే బ్యాంకులు బ్రాంచ్ స్థాయిలో వెరిఫికేషన్ అడగకూడదని స్పష్టం చేసింది.. ఒక కస్టమర్ ఈ-కేవైసీ చేసినట్లయితే లేదా సీ-కేవైసీ పోర్టల్‌లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే, బ్యాంకులు శాఖ…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి షాకిచ్చింది.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. రెపో రేటును 0.35 శాతం పెంచింది ఆర్బీఐ.. దీంతో, ఆర్బీఐ రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది.. దీని ప్రభావం దేశవ్యాప్తంగా తీసుకున్న వివిధ రుణాలపై పడనుంది.. ద్రవ్యోల్బణం మందగించడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఆర్బీఐ నుండి ముగ్గురు సభ్యులు మరియు ముగ్గురు బయటి…
పెద్ద నోట్ల (రూ.వెయ్యి, పాత రూ.500 నోట్లు)ను రద్దు చేసిన తర్వాత అంతకంటే మరో పెద్ద నోటును తీసుకొచ్చింది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆ సంచలన ప్రకటనకు ఈ మధ్యే ఆరేళ్లు పూర్తిఅయ్యాయి.. అయితే, రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త 2000 నోట్లను విడుదల చేశారు.. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నోట్ల రద్దు నిర్ణయం దేశ విదేశాల్లో నేటికీ చర్చనీయాంశంగానే ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై పెను…
పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత ఆరేళ్ల తర్వాత కూడా నగదు వినియోగం ఇంకా తగ్గలేదు. ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అక్టోబరు 21 నాటికి రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.