10 Countries Will Soon Let Non-Resident Indians Make UPI Payments: భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్లను సులభతరం చేసింది యూపీఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వీధిలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు పేమెంట్లు అన్నీ క్యాష్ లెస్ గా మారాయి. కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లావాదేవీలు చేయడానికి. ఇటీవల యూపీఐని విస్తృతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్…
Gold and Silver Markets: బంగారం, వెండి బిజినెస్ కొత్త సంవత్సరంలో ఆశాజనకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 2022 కంటే 2023లో బులియన్ మార్కెట్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోయినేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువ ఒడిదుడుకులే ఉంటాయని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ వ్యాల్యూ అత్యధికంగా దాదాపు 19 వందల 35 డాలర్లకు చేరుతుందని, తక్కువలో తక్కువ 16 వందల 30 డాలర్ల కన్నా దిగొచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు.
Bank Deposit Insurance Scheme : గత కొన్నేళ్లుగా.. ఆర్థిక అవకతవకల కారణంగా దేశంలోని చాలా బ్యాంకుల పరిస్థితి దిగజారింది. డబ్బు లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ నిషేధించే స్థాయికి వచ్చింది.
2022 ఏడాదికి బైబై చెప్పే సమయం వచ్చేసింది.. ఈ వారం ముగింపులోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. 2023లోని సెలవులకు సంబంధించిన తేదీల వివరాలు ప్రకటించాయి.. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను విడుదల చేసింది. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు.. బ్యాంకు లావాదేవీల్లో ఉండేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఈ క్యాలండర్ ఆధారంగా మీ…
EMIs High-No Extension: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్‌ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్‌ని పెంచుకునేవారు.
వడ్డీ రేట్లను పెంచుతూ షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇదే సమయంలో ఓ గుడ్‌న్యూస్ కూడా చెప్పింది.. ఆన్‌లైన్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే ఆప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్తే బ్యాంకులు బ్రాంచ్ స్థాయిలో వెరిఫికేషన్ అడగకూడదని స్పష్టం చేసింది.. ఒక కస్టమర్ ఈ-కేవైసీ చేసినట్లయితే లేదా సీ-కేవైసీ పోర్టల్‌లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే, బ్యాంకులు శాఖ…
RBI to launch Digital Rupee pilot in 4 cities today: క్యాష్ లెస్ ఎకానమీ కోసం దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. 2016 నుంచి భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది.
India's GDP grows at 6.3% in Jul-Sept quarter of FY23: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. బుధవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇది గతేడాదితో పోలిస్తే తక్కువే. 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో…
RBI Set To Launch Retail Digital Rupee: రిలైట్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ప్రారంభించనుంది ఆర్బీఐ. కస్టమర్స్ డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాటెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరగనున్నాయి. గురువారం నుంచి కొన్ని నగరాల్లో ఈ…