Bank holidays in January 2023: జనవరిలో బ్యాంకుల సెలవులు..! వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 ఏడాదికి బైబై చెప్పే సమయం వచ్చేసింది.. ఈ వారం ముగింపులోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. 2023లోని సెలవులకు సంబంధించిన తేదీల వివరాలు ప్రకటించాయి.. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను విడుదల చేసింది. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు.. బ్యాంకు లావాదేవీల్లో ఉండేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఈ క్యాలండర్ ఆధారంగా మీ పనులను సిద్ధం చేసుకుంటే మంచిది..
Read Also: All Party Meeting: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. తీర్మానాలు ఇవే..
Also Read
- Bima Sakhi: 10th పాసైన మహిళలకు నెలకు రూ.7,000.. LIC బంపరాఫర్! పూర్తి వివరాలు ఇవే..
- Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
- Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
2022 ముగింపుకు వస్తున్నందున 2023లో కొత్త సంవత్సరం ఎదురుచూస్తుంది. జనవరి 2023 నెలలో, బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయో తెలుసుకోవడం కస్టమర్లకు ముఖ్యం, తద్వారా వారు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 2023లో అనేక ప్రాంతీయ పండుగలు, జాతీయ కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర మరియు సమాఖ్య ప్రభుత్వ సెలవులు షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ రోజుల్లో ఏ బ్యాంకులలోనూ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆఫ్‌లైన్ ఆర్థిక లావాదేవీలు అనుమతించబడవు. ఫలితంగా, మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసేటప్పుడు మీరు ఈ రోజులను పరిగణనలోకి తీసుకోవాలి.. 2023 జనవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకు సెలవుల్ని ప్రకటించింది ఆర్బీఐ.. సెలవు దినాల్లో బ్యాంకుల్లో అత్యవసర పనులుంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని, లేదంటే మరో రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించింది.. ఈ 11 సెలవుల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారంతో పాటు ఆయా రాష్ట్రాల్లో పండగలకు అనుగుణంగా బ్యాంకులు పనిచేయనున్నాయి.. జనవరి 1న ఆదివారం, జనవరి 8న ఆదివారం, జనవరి 14న రెండో శనివారం, జనవరి 15న ఆదివారం, జనవరి 22న ఆదివారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం, జనవరి 28న నాల్గో శనివారం, జనవరి 29న ఆదివారం సెలవులుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!