ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొనసాగుతున్న ప్రొడక్షన్ వెంచర్లలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఆర్సీ 15’, ‘తలపతి 66’ వంటి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల గురించి తాజాగా దిల్ రాజు అప్డేట్స్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ల మూవీ ‘ఆర్సీ 15’. ఈ సినిమాపై మెగా అభిమానులకు బాగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా 2023 సంక్రాంతి సీజన్లో థియేటర్ లలో విడుదల కానుందని…
చిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ అస్సలు రిలీజ్ అవుతుందా..? అనే డౌట్ ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. ఇక ఆ అనుమానాలకు తెరలేపుతూ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు…
ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా వరకు పాకి తెలుగు సత్తా చూపిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ ఉత్తరాదిన విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు తో పాటు ఐదు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ దెబ్బతో బన్నీ సినిమాలన్నీ బాలీవుడ్ లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం జనవరి…
ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే వరుసగా వారసుల ఎంట్రీ మాత్రం జరుగుతోంది. సంక్రాంతికి దాదాపు ఆరేడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా అంటే…
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం “రౌడీ బాయ్స్”. హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నిన్న మ్యూజికల్ నైట్ అంటూ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ ట్రైలర్ చూశానని, ఆశిష్ మొదటి సినిమాలోనే బాగా నటించాడని…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న “రౌడీ బాయ్స్” సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ఈ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి నిన్న మ్యూజికల్ నైట్ అంటూ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్ లతో…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా RRR రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరో రామ్ చరణ్ స్పందించారు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రాంచరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ…
మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అదుపెట్టిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న సుస్మిత తాజగా సేనాపతి సినిమాను నిర్మించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో డా. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆహా ఓటిటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చి నడిపిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక…
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా పరాజయమెరుగుని దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన ఈ సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి 2022 సమ్మర్ లో రావచ్చని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాల కెరీర్ ని ఫణంగా పెట్టి నటించారు తారక్, చెర్రీ. ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ కి…
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు,…