దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టాడు. తాత్కాలికంగా ‘RC15’ అనే టైటిల్ తో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అయితే తాజాగా ‘RC15’ సెట్స్ నుండి ఒక వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ అంత క్లారిటీగా లేనప్పటికీ రామ్ చరణ్ గ్రామ రహదారిపై సైకిల్ తొక్కుతున్నట్లుగా కన్పిస్తోంది. అయితే ‘RC15’ టీం ముందుగానే లీకు రాయుళ్లను హెచ్చరించినప్పటికీ లీకులు తప్పట్లేదు.
Read Also : Music ‘N’ Play : ఒకరూ దేవుడిచ్చిన బావ.. ఒకరు దేవుడైన బావ..
ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. RC15లో ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ ప్రధాన హైలైట్‌లలో ఒకటి. యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షించడానికి మేకర్స్ ఇప్పటికే స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బరీవ్‌ను నియమించారు. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రిలోని అందమైన ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ‘RC15’కి తమన్ సంగీతం అందిస్తున్నారు.