త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. సినిమాలతో పాటు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న చెర్రీ బ్రాండ్ విలువ ఈ సినిమా తర్వాత మరింత పెరగటం ఖాయం. అయితే ఈ సినిమా విడుదలకు ముందే తాజాగా మరో బ్రాండ్ ని ఖాతాలో వేసుకున్నాడు చరణ్. అదే శీతల పానీయం ‘ప్రూటీ’. అయతే ప్రూటీకి ఇప్పటి వరకూ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ‘పుష్ప’ ఘన విజయంతో బన్నీ…
టాలీవుడ్ ఇప్పుడు రెండ్ బిగ్ మూవీస్ ను వెండి తెరపై చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మార్చ్ 11న విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కూడా మాములుగా లేదు. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మేనియా ఎలా ఉందన్న విషయాన్నీ తాజాగా ఓ అభిమాని చేసిన పని చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న…
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామా మార్చ్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి జక్కన్న సన్నాహాలు చేస్తున్నారు.…
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. అయినప్పటికి వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇక మెగా హీరోలందరూ దాదాపుగా సోషల్ మీడియాలో ఉన్నారు. అయితే తాజాగా చిరు సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టాడు. తాత్కాలికంగా ‘RC15’ అనే టైటిల్ తో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి “గాడ్ ఫాదర్” షూటింగ్లో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి “భీమ్లా నాయక్” సెట్‌ను సందర్శించి, తన సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు, నిత్యా మీనన్ పోషించిన పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’…
మెగా హీరో రామ్ చరణ్ విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులన్నింటిని బుధవారం రాత్రి నుంచి నిలిపివేసింది. 2015లో ట్రూజెట్ ఎయిర్‌లైన్స్‌తో ఏవియేషన్ వ్యాపారంలో అడుగుపెట్టాడు రామ్ చరణ్. అయితే ఈ సంస్థకు చెందిన అన్ని విమాలను గత రాత్రి నుంచి గ్రౌండ్ డౌన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ గాను, సాంకేతిక కారణాల వల్ల తమ సంస్థ కార్యకలాపాలకు తాత్కాలిక ఆటంకం ఏర్పడిందని త్వరలో పునఃప్రారంభిస్తామని ట్రూజెట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న నష్టాలే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్ లో కన్పించాడు. చెర్రీ డాషింగ్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత హ్యాండ్సమ్ గా, కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తోంది. Read Also : Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్…
సాధారణంగా సెలెబ్రిటీల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందికి ఉంటుంది. అందులో మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన కొత్త విషయాల కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఉపాసన తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ లో అత్తగారి పుట్టినరోజు సందర్భంగా సురేఖకు శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. Read Also :…