మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ స్టైలిష్ మేకోవర్ లో కన్పించాడు. చెర్రీ డాషింగ్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత హ్యాండ్సమ్ గా, కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తోంది.
Read Also : Upasana : అత్తగారితో అనుబంధం ఎలా ఉందంటే?… వీడియో వైరల్
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా “RC15” అనే పేరు పెట్టారు. ఈ మూవీ కోసమే ఈ కొత్త లుక్ అని సమాచారం. తెల్లటి టీ షర్ట్, నలుపు ప్యాంటుతో రెట్రో హెయిర్ స్టైల్‌లో చెవ్రాన్ మీసంలో మరింత అందంగా కనిపిస్తున్నాడు చరణ్. ఈ మెగా హీరో “RC15″లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, దానికోసం జుట్టును పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక “RC15” సినిమా షూటింగ్ రాజమండ్రిలో శరవేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, రెహమాన్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. “RC15″ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.