సాధారణంగా సెలెబ్రిటీల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందికి ఉంటుంది. అందులో మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన కొత్త విషయాల కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఉపాసన తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ లో అత్తగారి పుట్టినరోజు సందర్భంగా సురేఖకు శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన సందేశాన్ని పోస్ట్ చేసింది.
Read Also : Allu Arjun : మరో మైలురాయిని దాటిన ఐకాన్ స్టార్
ఆమె మెగా కుటుంబంతో ఉన్న అందమైన జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అంతేకాదు అత్తగారిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ “హ్యాపీ బర్త్‌డే మై డియరెస్ట్ అత్తమ్మా. మీరు మీ వైవాహిక జీవితానికి మూలాధారం. నాతో RC & రైమ్‌ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. లవ్ యూ” అని రాసింది. ఇంకేముందీ ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరిద్దరూ తల్లీకూతుళ్లలా చక్కగా కలిసిపోవడం చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘యు కెన్ కౌంట్ ఆన్ మి’ పాట ప్లే అవుతుండగా… అందులో రామ్ చరణ్, ఉపాసన, ఇతర మెగా కుటుంబ సభ్యులతో సురేఖ ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలలో ఉపాసన కామినేని ఒకరు. ఒక శక్తివంతమైన వ్యాపార కుటుంబం నుండి వచ్చిన ఉపాసన గ్రాడ్యుయేషన్ తర్వాత వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించింది. 2012లో రామ్ చరణ్‌తో వివాహం తర్వాత కూడా మంచి వ్యాపారవేత్తగా కొనసాగుతోంది.
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
