మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి “గాడ్ ఫాదర్” షూటింగ్‌లో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి “భీమ్లా నాయక్” సెట్‌ను సందర్శించి, తన సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న వీడియోను పోస్ట్ చేశాడు.
Read Also : HBD Nani : భలే భలే సింగరాయ…!
ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. టీమ్ “గాడ్‌ఫాదర్” నుండి “భీమ్లా నాయక్”కు ఆల్ ది బెస్ట్ చెప్పే క్యాప్షన్‌తో వీడియో ముగిసింది. ఈ వీడియోలో చిరంజీవి ఖైదీ బట్టల్లో కన్పించారు. ఇక ‘భీమ్లా నాయక్’ చిత్రబృందంలో రానా కూడా ఉన్నాడు ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన “భీమ్లా నాయక్”కు త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. తమన్ సంగీతం అందించారు.