యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ అవ్వడం, వాటిపై కామెంట్లు పెట్టి తమ అభిమాన హీరోలను మెచ్చుకోవడం లేదా విమర్శించడం వంటివి జరగడం సాధారణమే. కానీ ఒక వీడియోపై యూట్యూబ్ స్వయంగా కామెంట్ చేయడం మాత్రం విశేషం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించింది యూట్యూబ్. ఈసారి యూట్యూబ్ ఇండియా ట్విట్టర్ వంటి ఇతర సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రమోట్…
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. ఈ చిత్రంపై అభిమానులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న స్టోరీ ఏం చూపిస్తాడు..? అల్లూరి సీతారామరాజు, కొమరం…
దక్షిణ చిత్ర పరిశ్రమలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సౌత్ స్టార్స్ అంతా కలిసి దుబాయ్ ని టార్గెట్ చేశారు అన్పించక మానదు. ప్రస్తుతం దుబాయ్ సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారింది. పాన్ ఇండియా స్టార్స్ దృష్టి దుబాయ్ పై పడింది. పాన్ ఇండియా అన్న పేరుకు తగ్గట్టే తమ సినిమాల ప్రమోషన్స్ కోసం దుబాయ్ ని వాడుకుంటున్నారు దక్షిణాది తారలు. బాలీవుడ్ కంటే ‘తగ్గేదే లే’ !ఇంతకు ముందు సినిమా ప్రమోషన్ల కోసం కేవలం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ‘నాటు నాటు’ సాంగ్ మొత్తానికీ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వచ్చిన పాట కావడం, పైగా ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులేయడంతో సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో సెగలు రేపి, భారీ అంచనాలను నమోదు చేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఓ భారీ భవంతి ముందు,…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఇప్పటి నుంచే షురూ చేస్తున్నారు మేకర్స్. నిన్న ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ “నాటు నాటు” సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి…
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇద్దరు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరుగుతుంది. గిరిజన నాయకుడు భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కారణంగా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…
‘ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్ వేదికగా చిరంజీవి ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరి ఆశీ స్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు,…
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన ప్రేక్షక్షుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పేరిట విడుదల చేసిన వీడియో నందమూరి, మెగా అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ వీడియోతో అంచనాలు భారీగా పెరిగాయి.…
మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఆచార్య నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ విడుదల చేశారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామ్రేడ్ సిద్ద, నీలాంబరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను…