మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఫ్యామిలీలో మరొకరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కామినేని ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. ఉపాసన సోదరి, చరణ్ మరదలు అనుష్పాల కామినేని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రీసెంట్ గా అనుష్పాల కామినేనికి ఆమె ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో నిశ్చితార్థం జరిగింది. శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పల అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్. అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక పెళ్ళిలో ఉపాసన, చరణ్ దంపతులు ట్రెడిషనల్ వస్త్రధారణలో మెరిశారు.
Read Also : బీస్ట్ మోడ్ లో భీమ్… “ఆర్ఆర్ఆర్” కొత్త పోస్టర్
పెళ్లి వేడుకల్లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ యానికి ఓ పెద్ద బాధ్యతనే అప్పజెప్పారట చరణ్. మరదలి సంగీత్ సెలబ్రేషన్స్ ను నిర్వహించే బాధ్యతను యానీ మాస్టర్‌కు ఇచ్చారట. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే యాని సూపర్ స్టార్ కూతురు సితారకు డ్యాన్స్ నేర్పిస్తూ కన్పించింది. ఇప్పుడేమో భారీ ఈవెంట్ ను నిర్వహించే ఛాన్స్ రావడంతో ఆమె చాలా సంతోషంగా ఉందట. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పంచుకుంది యాని మాస్టర్. “15 ఏళ్లుగా మీరు నాపై నమ్మకం ఉంచుతూ వస్తున్నారు” అంటూ చరణ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ సంగీత్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం దోమకొండ కోటలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.