“ఆర్ఆర్ఆర్” కొత్త ప్రోమో… ట్రైలర్ పై అంచనాలను పెంచేస్తున్న టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రేపు విడుదల కానుంది. అయితే అప్పటిదాకా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆగాల్సిందే. అయితే వారి ఆతృతకు మరింత ఎగ్జైట్మెంట్ ను జోడించడానికి, ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజపరిచేందుకు మేకర్స్ వరుస అప్‌డేట్లతో వస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు రాబోతున్న సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఎదో ఒక అప్‌డేట్ ఇస్తూ అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల బీటీఎస్ వీడియోలను పంచుకున్నారు. రామ్ చరణ్ లుక్, సీతగా అలియా భట్ ప్రిపరేషన్, అజయ్ దేవగన్ పాత్ర పెద్దగా రివీల్ కానప్పటికీ అది పవర్ ఫుల్ గా ఉండబోతోందని ఆ వీడియోలలో తెలిపారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ సినిమా నుంచి హీరోలకు సంబంధించిన మరో పవర్ ప్యాక్డ్ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆరెండు ప్రోమోలు ట్రెండ్ అవుతున్నాయి.
Read Also : బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్ పంచులు
Also Read
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
- Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'
- 418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
“ఆర్ఆర్ఆర్”లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్‌తో మొదటి సారి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం 1920కి ముందు స్వాతంత్య్రం సమయంలో తెరకెక్కుతున్న కల్పిత కథ అని రాజమౌళి ముందే చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న రియల్ హీరోలు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌ల కథగా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోంది. ఇక “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ డిసెంబర్ 9 న విడుదల అవుతుంది. 2022 జనవరి 7న భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Brace Yourself for BHEEM … @tarak9999 @ssrajamouli #RRRMovie #RRRTrailer pic.twitter.com/ocKXObKYVe
— Ram Charan (@AlwaysRamCharan) December 8, 2021
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?