మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తాజా వెకేషన్ లో చెర్రీ సూర్యోదయాన మంచు కొండల్లో సేదతీరుతూ కన్పించాడు. ప్రస్తుతం చరణ్ తన బిజీ షెడ్యూల్స్ నుండి చిన్న విరామం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో హాలిడేలో ఉన్నాడు. చరణ్ తన సోదరితో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ కు వెళ్ళాడని, త్వరలో వారు ఇండియాకు తిరిగి వస్తారని సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఈవెంట్‌లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, మీడియా ఇంటరాక్షన్‌లు ప్లాన్ చేశారు మేకర్స్.
Read Also : పిక్ వైరల్ : వెకేషన్ లో చెర్రీ… మంచు కొండల్లో సేదతీరుతూ…
ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ రెండు షెడ్యూల్ లను ఇటీవలే పూర్తి చేసాడు రామ్ చరణ్. కొత్త షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. మరోవైపు చిరంజీవితో పాటు రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇవి మాత్రమే కాకుండా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక చిత్రానికి సంతకం చేసాడు చరణ్. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుంది. శంకర్, గౌతమ్ ల సినిమాల షూటింగ్ ను ఒకేసారి పూర్తి చేసే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు 2022 చివరి నాటికి పూర్తి చేసి 2023లో విడుదల చేయనున్నారు.